Sunday, May 24, 2026
E-PAPER
Homeఖమ్మంపేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

- Advertisement -

నవతెలంగాణ–అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఎస్‌ఐ టీ.యయాతీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. సంఘటన స్థలం నుంచి మరికొందరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -