- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
‘సర్’ ప్రక్రియ తుది గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా డిజిటైజేషన్ కు ఓటర్లు సహకరించాలని తహశీల్దార్ దాసరి కిషోర్ సూచించారు. పూర్తి చేసిన గణన పత్రాలను ఈ నెల 31 లోపు సంబంధిత బీఎల్ఓ లకు అందించాలని సూచించారు. తాశీల్ధార్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేది లోపు ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజ్ చేస్తామని, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే బీఎల్ఓ లను సంప్రదించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ సయ్యద్ హుస్సేన్ ఉన్నారు.
- Advertisement -



