Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో వైభవంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు  

ఆలేరులో వైభవంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
ఆలేరు పట్టణంలో శనివారం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ దేవి, శ్రీ గోదాదేవి సహిత శ్రీ రంగనాయక ఆలయంలో ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని, ఆలయం పూలమాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు తెల్లవారుజామునుండి  శ్రీ లక్ష్మీదేవి శ్రీ గోదాదేవి సహిత శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకున్నారు. మహిళ భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోర్తాల గోపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -