నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్.. ఈ ముగ్గురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకరన్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు.
అయితే ఏఐఏడీఎంకేలో ఈ తిరుగుబాటు ఇప్పుడే మొదలైంది కాదు. సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వానికి గుడ్ బై చెప్పిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ తిరుగుబాటు వర్గంలో భాగమేనని తెలుస్తోంది.



