Tuesday, May 26, 2026
E-PAPER
Homeబీజినెస్రూపాయికి నిర్ధిష్ట విలువ లక్ష్యం లేదు..!

రూపాయికి నిర్ధిష్ట విలువ లక్ష్యం లేదు..!

- Advertisement -


ముంబయి : అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల వల్ల ఇటీవల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 100 మార్క్ దిశగా పతనమవడంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎట్టకేలకు స్పందించారు. రూపాయి విలువ ఎక్కువ అంచనా (ఓవర్ వ్యాల్యూ)లో లేదని, వాస్తవిక విలువ కంటే తక్కువగానే ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయిని లక్ష్యంగా పెట్టుకోదన్నారు. మార్కెట్‌లో ఊహాజనిత కదలికలు లేదా అధిక అస్థిరతను అరికట్టడానికి మాత్రమే కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత అంతర్జాతీయ అస్థిరతల మధ్య కూడా మన దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్థిరంగా ఉన్నాయని, విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే.. భారత కరెన్సీ విలువను మరింత స్థిరంగా ఉంచేందుకు దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయికి ఒక నిర్దిష్ట విలువను నిర్దేశించుకోవడం కంటే కరెన్సీ మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికే తాము ప్రాధాన్యమిస్తామని వివరించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -