Tuesday, May 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నాగరాజ్ గౌడ్ నియామకం

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నాగరాజ్ గౌడ్ నియామకం

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో నాగరాజ్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నాగరాజ్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతరావుల నేతృత్వంలో, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన యువ నాయకుడు ఇలియాస్ బాయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగరాజ్ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -