Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ లబ్ధిదారులకు గోడ గడియారాలు పంపిణీ

ఇందిరమ్మ లబ్ధిదారులకు గోడ గడియారాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని మథూరా తాండాలో గ్రామ సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ చేయడం జరిగింది జీపీ కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి స్రవంతి తెలిపారు. బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలు జిపి కార్యదర్శి గ్రామ అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలు తీరు అయిన గ్రామస్తులకు అవగాహన చేయడమే కాకుండా సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా తమ వంతుగా కృషి చేస్తామని గ్రామస్తులకు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జిపి కార్యదర్శి ,గ్రామస్తులు , మహిళా సంఘాల సభ్యులు,  యువకులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -