నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్ పరిశీలన చేయడం జరిగిందని జీపీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ పథకం ఆధ్వర్యంలో గృహాలు నిర్మిస్తున్న లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిబంధనలు పాటించాలని అన్నారు. నిబంధనలు గ్రామ జీపీ కార్యదర్శి , హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు అవగాహన చేయడం ఎంతో అవసరమని అన్నారు. పూర్తీ చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా ఖాతా లో నిధులు మంజూరు చేసి జమా చేయాలని హౌసింగ్ అధికారులలు ఆదేశించారు. చిన్న సమస్యలు ఉంటే నేరుగా గ్రామంలోనే పరిష్కరించు కోవాలి సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు హౌసింగ్ అధికారులు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



