Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద గుల్లా తాండలో బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పనులు పూర్తి

పెద్ద గుల్లా తాండలో బోర్ వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పనులు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద గుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ ఆధ్వర్యంలో పనులు పూర్తి చేయడం జరిగిందని జీపీ కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుమతి రాథోడ్ యశ్పాల్ రాథోడ్ తెలియచేస్తు ప్రత్యేకంగా ప్రభుత్వ వికాస్ భారత్ గ్యారంటి ఫర్ రోజ్ గార్ అండ్ అజివిక మీషన్ (గ్రామీణ) ( వి – బిజి రామ్ జీ ) పథకంలో భాగంగా బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులను పూర్తి చేసారు. మండల పరిషత్ అధికారులు ఆదేశాల మేరకు బాధ్యతగా పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నీటి లభ్యత ఉపయోగం , భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తుంది అని అన్నారు. కేంద్రం పరిధిలోని పథకం కింద పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు అయిన వాటికి వెంటనే బ్యాంకు ఖాతాలో జమా చేయాలని  అన్నారు . భవిషత్ తరాలకు భూగర్భ జలాలు పైకి ఎగబాకులతో అందించటానికి మేము చేస్తున్న బొర్వేల్ రిచార్జ్ స్ట్రక్చర్ ఉపయోగిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , జిపి కార్యదర్శి , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -