Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

ప్రత్యామ్నాయ, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

- Advertisement -

పీఎన్‌ఎమ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ
ప్రజా ఉద్యమాల నుంచి రచయితలు, కళాకారులు పుట్టుకొచ్చారని ప్రజా నాట్య మండలి (పీఎన్‌ఎమ్‌) ‌రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ తెలిపారు. ప్రతినిధుల సభలో ఆయన సౌహార్ద సందేశమిస్తూ…నిర్బంధాల మధ్య నుంచి పీఎన్‌ఎమ్‌ ‌పుట్టిందనీ, ఇప్పుడు అదే రీతిలో నిర్బంధం ఉందని తెలిపారు. సాంస్కృతిక ఉద్యమంపై దాడి తీవ్రమవుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజల కోసం పనిచేసే కవులు, రచయితలు, జర్నలిస్టులపై మోడీ పాలనలో దాడులు తీవ్రతరమయ్యాయని విమర్శించారు. ప్రజా సంస్కృతిని మతోన్మాద, పెట్టుబడి దారీ సంస్కృతిగా చిత్రీకరిస్తున్నారనీ, ప్రజల పక్ష‍ం ఉన్న కళాకారులను కూడా మోల్డ్‌ ‌చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జానపద కళారూపాలను హిందూ సంస్థల ప్రచారం కోసం, భక్తి వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమైందని హెచ్చరించారు. చాపకింద నీరులా మతం మత్తులోకి కళాకారులను మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపుతున్న భారాల విషయాన్ని అర్థమయ్యే రీతిలో వివరించాలనీ, అప్పుడే ప్రజలు ఉద్యమాల్లోకి వస్తారని చెప్పారు. ప్రత్యామ్నాయ, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -