Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'భోగి' భారీ క్లైమాక్స్ పూర్తి

‘భోగి’ భారీ క్లైమాక్స్ పూర్తి

- Advertisement -

శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మి రాధామోహన్ సమర్పణ. తాజాగా చిత్ర యూనిట్ భారీగా రూపొందించిన 22 రోజుల క్లైమాక్స్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ప్రతి ఫ్రేమ్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించేందుకు నిర్మాత ఎలాంటి రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. ఈ క్లైమాక్స్‌కు స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ యాక్షన్‌ను డిజైన్ చేశారు. సినిమాలో ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న శర్వా తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్ లో సాగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -