నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో గుజరాత్ పై ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్‌ను ఓడించింది.
మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. “ఈ మ్యాచ్‌ను మేం వీలైనంత త్వరగా మర్చిపోయి, మొహాలీలో జరిగే తర్వాతి మ్యాచ్ కోసం సిద్దమవాలి. మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టుగా లేదు. రెండు క్యాచ్‌లు జారవిడిచాం. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు” అని వ్యాఖ్యానించాడు. పవర్‌ప్లేలో మంచి ఆరంభం లభించి ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా ఛేదించవచ్చు. కానీ మేం విఫలమయ్యాం” అని గిల్ తెలిపాడు. సాయి సుదర్శన్ బ్యాట్ చేజారి స్టంప్స్‌ను తాకి ఔట్ కావడం దురదృష్టకరమని గిల్ పేర్కొన్నాడు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, మొహాలీలో జరిగే తదుపరి నాకౌట్ మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.



