చక్రం తిప్పిన ప్రభుత్వ విప్ బీర్ల
నవతెలంగాణ – ఆలేరు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ మధ్యన పోటీ రసవత్తరంగా మారింది. మంగళవారం విత్ డ్రా చేసుకునే చివరి తేదీ బి ఆర్ ఎస్ పార్టీకి ఆలేరు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య షాక్ ఇచ్చారు. బి ఆర్ ఎస్ పార్టీ పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ పై టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవుల సాయి మమత తన నామినేషన్ ఉపసమరించుకొని బీఆర్ఎస్ ను కోలుకొని విధంగా చేశారు. మంగళవారం సాయంత్రం రెండున్నర గంటలకు. మమత సాయి వచ్చి తమ నామినేషన్ ఉపసంహరించుకొని వెళ్లిపోయారు.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది.గోవాకు వెళ్లినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.ఈ సంఘటన వెనుక ఐలయ్య చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.ఇదే వార్డులో మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా విత్ డ్రా చేసుకోవడంలో ఎమ్మెల్యే సోమవారం రాత్రి ఒంటిగంట వరకు పోటీ నుండి విరమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు విశ్వసినీయ సమాచారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఈ హఠాత్పరిణామం జీర్ణించుకోక సోషల్ మీడియా లో ఆవేదనతో మాట్లాడిన వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికలకు మరో తొమ్మిది రోజులు మిగిలి ఉండగానే ఇలాంటి పరిణామాలు చోటు చేసు కోవడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకులు మాత్రం ఉత్సాహంతో ఉన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పన్నిన వ్యూహం తో చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యను గుండ్లపల్లి వాణి భరత్లను సన్మానించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయని తెలుస్తోంది.



