- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉజాలే అప్నీ యాదోం కే హమారే సాథ్ రెహ్నే దో’ వంటి పంక్తులతో సాహితీ లోకంలో విశేష గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్ బద్ర్ (91) దీర్ఘకాలిక అనారోగ్యంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తుదిశ్వాస విడిచారు. చాలా సంవత్సరాలుగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న ఆయన, భోపాల్‌లోని స్వగృహంలో కన్నుమూశారని ఆయన కుమారుడు సయ్యద్ బద్ర్ తెలిపారు. జీవితానికి సంబంధించిన కవిత్వంతో సాహిత్య ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



