- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ ప్రభుత్వం భారత మామిడి పండ్ల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించడం దేశీయ ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు, ఫ్రూట్ ఫ్లైస్ ప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ వెల్లడించింది. దీంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్డా, బంగినపల్లి వంటి ప్రీమియం మామిడి రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ రాష్ట్రాల వ్యాపారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి APEDA, కేంద్ర ప్లాంట్ క్వారంటైన్ అధికారులు జపాన్‌తో చర్చలు జరుపుతున్నారు.
- Advertisement -



