Friday, May 29, 2026
E-PAPER
Homeబీజినెస్శ్రీకాళహస్తిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిన హెచ్‌సీసీబీ

శ్రీకాళహస్తిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిన హెచ్‌సీసీబీ

- Advertisement -

నవతెలంగాణ – శ్రీకాళహస్తి: హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ ) తమ ప్రతిష్టాత్మక సామాజిక భాగస్వామ్య కార్యక్రమమైన ‘ప్రాజెక్ట్ షైన్ ‘లో భాగంగా, స్థానిక గ్రామ పంచాయతీలకు విద్యుత్ వాహన (ఈవీ) వ్యర్థాల సేకరణ ట్రక్కులను అందజేసింది; అలాగే ఒక ఆర్ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించడంలో తమ సహకారం అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గౌరవ  శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ బోజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొనగా, స్థానిక అధికారులు మరియు ప్రజల సమక్షంలో ఈ ఈవీ వ్యర్థాల సేకరణ ట్రక్కులను గ్రామ పంచాయతీలకు అందజేశారు.

ఈ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు చెర్లోపల్లి, తొండమనాడు మరియు కాపుగున్నేరి గ్రామాల్లోని ప్రజలకు సేవలు అందిస్తాయి. ఈ గ్రామాల పరిధిలోని దాదాపు 50 వీధుల్లో ఇవి పర్యటించి, గ్రామ పంచాయతీల ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మారుస్తాయి. దేశవ్యాప్తంగా స్థానిక మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో సుస్థిర వ్యర్థాల నిర్వహణ, ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాల కల్పనలో హెచ్‌సీసీబీ తన పెట్టుబడులను నిరంతరం కొనసాగిస్తోంది.

సురక్షితమైన తాగునీటిని అందించడం హెచ్‌సీసీబీ సీఎస్ఆర్ కార్యక్రమాలలో ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇందులో భాగంగా చల్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కలుజుమిట్టలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టరేషన్ యూనిట్ ద్వారా గ్రామస్తులకు రక్షిత మంచినీరు అందుబాటులోకి రానుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. సామాన్యుల కనీస అవసరాలను తీర్చడం, అభివృద్ధిని ప్రోత్సహించడం పట్ల సంస్థకు ఉన్న అంకితభావాన్ని ఇటువంటి సామాజిక కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా హెచ్‌సీసీబీ గ్రామీణ మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ఏర్పేడు మండలంలోని కట్రకాయల గుంట గ్రామంలో ఆధునికీకరించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానికులకు అంకితం చేశారు. దీని ద్వారా చిన్నారుల ప్రారంభ విద్య, సంరక్షణకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మౌలిక అవసరాలను తీరుస్తూ, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించాలనే సంస్థ దీర్ఘకాలిక లక్ష్యానికి ఈ కార్యక్రమాలు అద్దం పడుతున్నాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పల్లెల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు. చెర్లోపల్లి, తొండమనాడు, కాపుగున్నేరి గ్రామ పంచాయతీలకు అందజేసిన ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలతో పాటు, చల్లపాలెం పంచాయతీ కలుజుమిట్టలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్.. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న సామాజిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పొరుగు గ్రామాలకు సైతం ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. స్థానిక అవసరాలను తీర్చడానికి, శ్రీకాళహస్తి ప్రాంతంలో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి హెచ్‌సీసీబీ వంటి సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం” అని అన్నారు.

హెచ్‌సీసీబీ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ, “దేశ ప్రగతి గ్రామాల నుంచే ప్రారంభమవుతుందని హెచ్‌సీసీబీ బలంగా నమ్ముతుంది. కమ్యూనిటీల భాగస్వామ్యమే మా కార్యకలాపాలకు కేంద్ర బిందువు. ‘ప్రాజెక్ట్ షైన్’ ద్వారా స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తూ సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, పర్యావరణహితమైన చెత్త సేకరణ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాము. అలాగే మహిళలు, యువతకు సాధికారత కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలకు అండగా నిలుస్తున్నాము. తద్వారా మా తయారీ కేంద్రాల చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు మెరుగైన మద్దతు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రజల సహకారాన్ని మేము ఎంతో గౌరవిస్తున్నాము. ఏపీ భవిష్యత్తు కోసం మా సహాయ సహకారాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తాము” అని వివరించారు.

‘ప్రాజెక్ట్ షైన్’ ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికన పనిచేస్తుంది: పర్యావరణం & విపత్తు నిర్వహణకు సుస్థిర పరిష్కారాలు; వాష్ (వాష్- నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం & పరిశుభ్రత; మహిళా సాధికారత & ఉపాధి ద్వారా సమ్మిళిత వృద్ధి; విద్య & నైపుణ్యాభివృద్ధితో ప్రతిభను ప్రోత్సహించడం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం కమ్యూనిటీలకు సాధికారత కల్పించడం. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య, పరిశుభ్రత అవగాహనా కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, మహిళలు మరియు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి పలు సీఎస్ఆర్ కార్యక్రమాలను హెచ్‌సీసీబీ ముమ్మరంగా చేపడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత, సుస్థిర వృద్ధికి మద్దతుగా స్థానిక ప్రజలు, ప్రభుత్వ భాగస్వాములతో కలిసి పనిచేస్తూ సానుకూల మార్పు తీసుకురావడానికి హెచ్‌సీసీబీ కట్టుబడి ఉంది.

హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ ) గురించి:

భారతదేశపు అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, 1997 ఫిబ్రవరి 14న ఏర్పాటైంది. నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2026 మార్చి 31 నాటికి 20 లక్షలకు పైగా రిటైలర్లు, సుమారు 2,000 మంది డిస్ట్రిబ్యూటర్లు, 5,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని 10 రాష్ట్రాలు, 236 జిల్లాల్లో సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 14 కర్మాగారాలను కలిగి ఉన్న ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఉనికి ఉంది. గుంటూరు జిల్లా ఆత్మకూరు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలలో రెండు అత్యుత్తమ అత్యాధునిక తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. హెచ్‌సీసీబీ 8 విభాగాల్లో 37 విభిన్న ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కోకా-కోలా, థమ్స్ అప్, స్ప్రైట్, మినిట్ మెయిడ్, మాజా, స్మార్ట్ వాటర్, కిన్లీ, లిమ్కా, ఫాంటా వంటి భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన పానీయాలు ఈ సంస్థ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -