- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ‘వేరొకరైతే పరిస్థితి వేరేలా ఉండేది.. కానీ, ఆమె దేశానికి గర్వకారణంగా నిలిచారు’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. డబ్ల్యూఎఫ్‌ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఫొగాట్‌కు దిల్లీ హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ డబ్ల్యూఎఫ్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- Advertisement -



