- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2026 రుతుపవనాలకు సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 90 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ అంచనాల్లో 4 శాతం అటూఇటూగా మార్పులు ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈసారి వర్షపాతం ‘సాధారణం కంటే తక్కువ’ కేటగిరీలోకి వస్తుందని, ఇది వ్యవసాయ రంగం, జలవనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
- Advertisement -



