Friday, May 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలునూతన డిజిపి సి.వి. ఆనంద్ ను కలిసిన సీఐటీయు రాష్ట్ర నాయకులు

నూతన డిజిపి సి.వి. ఆనంద్ ను కలిసిన సీఐటీయు రాష్ట్ర నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా నియమితులైన సి.వి. ఆనంద్, ఐపిఎస్ కు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ ఇవాళ డిజిపి కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమాల నిర్వహణలో పోలీస్ శాఖ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని కోరారు.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కార్మిక సమ్మెలు, ప్రజా ఉద్యమాలు, ఆందోళనా-పోరాటాల పట్ల పోలీస్ శాఖ దురుసుగా వ్యవహరించిందని, ఈ ఘటనలను నూతన డిజిపి ప్రజాతంత్ర కోణంలో పరిశీలించాలని పోలీస్ శాఖకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -