Friday, May 29, 2026
E-PAPER
Homeబీజినెస్10 లక్షల మంది వినియోగదారుల మార్కును అధిగమించిన ప్లాటినం ఆర్ఎక్స్

10 లక్షల మంది వినియోగదారుల మార్కును అధిగమించిన ప్లాటినం ఆర్ఎక్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సరసమైన ధరలలో బ్రాండెడ్-జెనరిక్ మందుల కోసం భారతదేశంలో ఎక్కువమంది విశ్వసించే వేదిక అయిన ప్లాటినంఆర్ఎక్స్ (PlatinumRx), ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది రోగులకు సేవలు అందిస్తూ, నాణ్యమైన జెనరిక్ ప్రత్యామ్నాయాల అందుబాటులోకి తీసుకురావటం ద్వారా తన వినియోగదారులకు మొత్తం 128 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసింది.

మధుమేహం, అధిక రక్తపోటు , గుండె జబ్బులతో బాధపడుతున్న లక్షలాది మంది భారతీయులకు, నెలకు రూ. 2,000 నుండి 5,000 రూపాయల మందుల బిల్లులు కొత్తేమీ కాదు. అవి కనిపించకుండానే నిరంతర భారంగా పరిణమిస్తుంటాయి.  ఈ భారం 70 కోట్లకు పైగా ప్రజలను మందులు మానేలా, రీఫిల్స్‌ను ఆలస్యం చేసేలా లేదా ఎలాంటి మందులు వాడకుండా గడిపేసేలా చేస్తోంది. ఈ లెక్కలను మార్చడానికే ప్లాటినంఆర్ఎక్స్ రూపొందించబడింది.

ఈ ప్లాట్‌ఫామ్, ప్రతి మందుకు ఒక జాగ్రత్తగా ఎంపిక చేసిన, అధిక నాణ్యత గల బ్రాండెడ్ జెనరిక్ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. దీనిని ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ కంపెనీల నుండి నేరుగా సేకరిస్తుంది. ఇది బ్రాండెడ్ ఒరిజినల్స్‌లో ఉన్నట్లుగానే 100% అదే సాల్ట్ కాంపోజిషన్‌ను కలిగి ఉంటుంది. లైసెన్స్ పొందిన ఫార్మసిస్టుల ద్వారా దీనిని పంపిణీ చేస్తారు, భారతదేశవ్యాప్తంగా 20,000కు పైగా పిన్ కోడ్‌లకు డెలివరీ చేస్తారు. మెట్రో నగరాల్లో ఒక రోజు డెలివరీ అందుబాటులో ఉంది. మిగతా అన్ని చోట్ల ఒకటి నుండి మూడు రోజులలో డెలివరీ అందిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా, రోగులు నాణ్యత లేదా భద్రత విషయంలో రాజీ పడకుండా తమ నెలవారీ మందుల బిల్లులపై 50-60% ఆదా చేసుకుంటున్నారు.

“భారతీయ రోగుల చేతుల్లోకి తిరిగి వచ్చిన 128 కోట్ల రూపాయలు ఒక వ్యాపార కొలమానం కాదు. కుటుంబ బడ్జెట్‌లలోనే ఉండి, స్కూల్ ఫీజులు, కిరాణా సామాగ్రి మరియు రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఈ 128 కోట్ల రూపాయలు, మందుల బిల్లులు రూపేణా వారి అవసరాలను అధిగమిస్తున్నాయి ” అని ప్లాటినమ్‌ఆర్‌ఎక్స్ సహ-వ్యవస్థాపకుడు అశుతోష్ పాండే అన్నారు. “నాణ్యమైన ఔషదాలు ఒక విలాసం కాకూడదు అనే ఒక సాధారణ నమ్మకంతో మేము ప్రారంభించాము. దాదాపు పది లక్షల కుటుంబాల తర్వాత, ఆ నమ్మకం ఒక ఉద్యమంగా మారుతోంది” అని అన్నారు. 

రద్దీగా ఉన్న జెనరిక్స్ మార్కెట్ నుండి ప్లాటినమ్‌ఆర్‌ఎక్స్‌ను వేరుచేసేది దాని ఉద్దేశపూర్వక సంయమనం. డజన్ల కొద్దీ ఎంపికలతో రోగులను అయోమయానికి గురిచేయకుండా, ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతి సాల్ట్ కు ధృవీకరించబడిన ఒకే ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. దీనివల్ల గందరగోళం తొలగిపోయి, నమ్మకం పెరిగి, సూచించిన బ్రాండ్ నుండి బ్రాండెడ్ జెనరిక్‌కు మారడం ఒక్క ట్యాప్‌తో చాలా సులభం అవుతుంది. 

భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో వున్న ఆర్థిక భార సమస్య అనేది  సరఫరా సమస్య కాదని, అది విశ్వాసం , లభ్యతకు సంబంధించిన సమస్య అనే దృఢ విశ్వాసంతో ఐఐటి ఢిల్లీ మరియు ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థులైన అశుతోష్ పాండే మరియు పియూష్ కుమార్ ప్లాటినమ్‌ఆర్‌ఎక్స్ ను స్థాపించారు. రోగులలో బ్రాండెడ్ జెనరిక్‌ల వాడకం 2024లో 22% నుండి 2025లో  దాదాపు రెట్టింపుకి పెరిగి 40% అయింది. 2026 చివరి నాటికి ఇది 70% దాటుతుందని అంచనా. ఒక్కో ప్రిస్క్రిప్షన్‌తో విశ్వాసం పెరుగుతోందని డేటా చూపిస్తుంది. సగటున, దీర్ఘకాలిక రోగులు తమ మందులపై నెలకు రూ. 1,500* ఆదా చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -