Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఈసెట్‌ (టీజీఈసెట్‌ 2026)కు షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్‌ 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఈసెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 15న నిర్వహించనున్నారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2026-2027 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

డీఈఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల
డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యూకేషన్‌ (డీఈఈసెట్‌ – 2026), డిప్లొమా ఇన్‌ ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌) లో ప్రవేశాల కోసం డీఈఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు సెట్‌ చైర్‌పర్సన్‌ నవీన్‌ నికోలస్‌ బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరీక్షను మే 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనున్నారు.

6న పరీక్షా పే చర్చ
ఈ నెల 6న ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరీక్షా పే చర్చ (పీపీసీ) కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుందని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులను ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రోత్సహించాలనీ, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -