Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లి గొంతు కోసి, యువకుడు ఆత్మహత్య

తల్లి గొంతు కోసి, యువకుడు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో వడ్డూరి శ్రావణ్ కుమార్ (33) తన తల్లి దుర్గమ్మపై కత్తితో దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో మెడ కోసుకుని శ్రావణ్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దుర్గమ్మను స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -