Saturday, May 30, 2026
E-PAPER
Homeబీజినెస్క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడమే మా లక్ష్యం: SVICCAR

క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడమే మా లక్ష్యం: SVICCAR

- Advertisement -

నవతెలంగాణ – తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. 

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి మరియు అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది. ఈ కారణం చేత నోటిలో నొప్పి లేని తెల్లటి మచ్చ వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోవటం లేదు. మింగడం బాధాకరంగా మారే వరకు లేదా గొంతు బొంగురుపోయే వరకు లక్షణాలను విస్మరించి, వ్యాధి ముదిరిన దశకు  హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.

పెరుగుతున్న ఈ సంక్షోభంపై టాటా ట్రస్ట్స్ మద్దతుతో నడుస్తున్న టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ యొక్క విభాగమైన ఎస్‌విఐసిసిఎఆర్ (SVICCAR) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ  “తిరుపతి , దాని పరిసర ప్రాంతాలలో క్యాన్సర్ భారం పెరుగుతోందని గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. 2023 నుండి రిజిస్ట్రేషన్లలో 60% పెరుగుదల తీవ్రమైన విషయమే అయినప్పటికీ, ఇది ఈ వ్యాధి పట్ల పెరిగిన అవగాహనను, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారని కూడా వెల్లడిస్తుంది. 

రోగులు సుదూర నగరాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, ప్రపంచ స్థాయి, నిరూపిత -ఆధారిత క్యాన్సర్ సంరక్షణను తిరుపతిలో అందించడమే మా లక్ష్యం. మా విస్తృతమైన కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా, మేము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను క్షేత్రస్థాయికి చురుకుగా తీసుకువెళ్తున్నాము, పొగాకు వల్ల కలిగే ప్రమాదాల గురించి సమాజంలో అవగాహన కల్పిస్తున్నాము.  వ్యాధిని ముందుగానే గుర్తించడానికి స్థానిక వైద్యులను, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ అందించటం ద్వారా  శక్తివంతం చేస్తున్నాము” అని అన్నారు. 

అదృష్టవశాత్తూ, తిరుపతిలోనే ఈ అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఉండటం వల్ల రోగుల జీవితాలు మెరుగుపడుతున్నాయి. ప్రాణరక్షణ కోసం సుదూర మెట్రో నగరాలకు ప్రయాణించాల్సిన అవసరమిప్పుడు లేదు. ఎస్‌విఐసిసిఎఆర్ లో,  కీమోథెరపీ నుండి అధునాతన రేడియేషన్ థెరపీ మరియు ప్రత్యేక నొప్పి నివారణ వరకు అన్ని సేవలనూ నిపుణులు అందిస్తున్నారు. ఎస్‌విఐసిసిఎఆర్ లో తల మరియు మెడ క్యాన్సర్ల కోసం సంక్లిష్టమైన, ప్రాణరక్షక శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 22-23లో కేవలం 33గా ఉన్న ఈ సంఖ్య, ఆర్థిక సంవత్సరం 25-26 నాటికి 697కి చేరింది.

ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించటానికి , ఈ సంస్థ ఒక ప్రత్యేక పొగాకు విరమణ క్లినిక్‌ను ప్రారంభిస్తోంది. ఇది స్థానికులు తమ వ్యసనాన్ని క్యాన్సర్‌గా మారకముందే వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఎస్‌విఐసిసిఎఆర్  ప్రతి నెలా 4 నుండి 5 అవగాహన సదస్సులతో 20 అవుట్‌రీచ్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 2020 సంవత్సరం నుండి ఎస్‌విఐసిసిఎఆర్ అవుట్‌రీచ్ బృందాలు ఈ ప్రాంతంలో నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ల కోసం 1,43,567 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి. వారు పొగాకు ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే, క్యాన్సర్ యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడానికి వేలాది మంది స్థానిక ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు.

ప్రమాదాలు ఎక్కడ మొదలవుతాయో గుర్తించి అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటుంది ఎస్‌విఐసిసిఎఆర్. పిల్లలు చిన్న వయసులోనే ఈ అలవాటును అలవర్చుకోకుండా కాపాడటానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించటంతో పాటుగా స్థానిక ఆటో-రిక్షా యూనియన్లతో కలిసి లక్షిత అవగాహన కార్యక్రమాలను కూడా సంస్థ బృందాలు నిర్వహిస్తున్నాయి. 

అంతిమంగా, సమాజాన్ని రక్షించడం అనేది రెండు సాధారణ విషయాలపై ఆధారపడి ఉంటుంది: వైద్యులు మరియు నాణ్యమైన వైద్య సంరక్షణ అందుబాటులో ఉంచటం, మరియు రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం. ఎస్‌విఐసిసిఎఆర్ వంటి సంస్థల ద్వారా స్థానిక కుటుంబాలకు సంరక్షణ విస్తరిస్తూనే ఉంది. పొగాకు వల్ల కలిగే ప్రమాదాలు తీవ్రరూపం దాల్చక ముందే వాటిని గుర్తించడం ద్వారా క్యాన్సర్ నుండి రక్షణ ఇంట్లోనే మొదలవుతుంది. ముందస్తుగా గుర్తించడం , బలమైన ఆరోగ్య సంరక్షణ మద్దతుతో,  కోలుకునే మార్గం గతంలో కంటే మరింత సులువుగా మరియు ఆశాజనకంగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -