ఫైనల్లో అర్సెనాల్‌పై ఉత్కంఠ విజయం
బుదాపెస్ట్ (హంగరీ) : పారిస్ సెయింట్ జర్మెన్ (పీఎస్‌జీ) చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో రియల్ మాడ్రిస్ తర్వాత వరుసగా రెండు సీజన్లు యూరోపియన్ చాంపియన్స్ లీగ్ (యుసీఎల్) విజేతగా నిలిచిన జట్టుగా నిలిచింది. ఆదివారం బుదాపెస్ట్‌లో జరిగిన యుఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ ఫైనల్లో అర్సెనాల్‌పై పీఎస్‌జీ ఉత్కంఠ విజయం సాధించింది. 90 నిమిషాల ఆటలో అర్సెనాల్, పీఎస్‌జీ 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. 30 నిమిషాల అదనపు సమయంలోనూ స్పష్టమైన విజేత తేలలేదు. దీంతో ఫలితాన్ని షూటౌట్ ద్వారా నిర్ణయించారు. షూటౌట్‌లో పీఎస్‌జీ 4-3తో అర్సెనాల్‌పై పైచేయి సాధించింది. అంతకముందు తొలుత ఆట మొదలైన ఆరో నిమిషంలోనే గోల్ కొట్టిన కై హావెర్జ్ట్ అర్సెనాల్‌కు 1-0తో విలువైన ఆధిక్యం అందించాడు. ప్రథమార్థం ముగిసేవరకు అర్సెనాల్ ముందంజలో నిలిచింది. ఉస్మాన్ డెంబెలే 64వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇంజూరీ టైమ్ సహా అదనపు సమయంలోనూ ఇరు జట్లు మరో గోల్ కొట్టలేదు. 93 శాతం పాస్ కచ్చితత్వం, 72 శాతం బంతి నియంత్రణతో పీఎస్‌జీ ఫైనల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. పీఎస్‌జీ యూరోపియన్ చాంపియన్స్ లీగ్ విజేతగా నిలువటంతో పారిస్‌లో సంబురాలు మిన్నంటాయి. అభిమానులు వీధుల్లోకి సంబురాలు చేసుకున్నారు. కానీ గెలుపు వేడుకలు శృతి మించగా అభిమానం కాస్త వీధుల్లో వీరంగానికి దారితీసింది.
యూరోపియన్ విజేత ‘పీఎస్‌జీ’
- Advertisement -
- Advertisement -



