ఆర్టిఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నిరంతరం ఉద్యమాలతో అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం జూన్ 2 , 2014న ఏర్పడిందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కో కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. మహముత్తరం మండల కేంద్రంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 2026 జూన్ 2 కు12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13 సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు. పాలనలో ప్రజాస్వామిక స్వభావాన్ని బదులుగా గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వం అరాచక పాలన, ప్రజాస్వామిక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా, సహజ వనరులు ఉన్నాయి అవి స్థానిక ప్రజలకు చేతుల్లో వెళ్లడం లేదని ఇసుక మాఫియా రాజ్యమేలుతుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్రంలో కొత్త సంస్థలు కొత్త పరిశ్రమలు రావాలని స్థానికులకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలల్లో దృష్టి పెట్టి ప్రజలను రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది, మానవ అభివృద్ధికి అడుగడుగున అనారోగ్యపరంగా మరణాలు విరిగిపోయే అవకాశాలు ఉన్నాయని, ప్రతి సంవత్సరంలో పంట ఉత్పత్తిపెరుగుతున్నాయి. కానీ రైతులు కుటుంబాలు ఆదాయం పడిపోతున్నాయన్నారు. కౌలు రైతుల సంఖ్య పెరిగిపోతున్నాయని పేదల హక్కుల కల్పించే చట్టం తీసుకురావాలని రాష్ట్రంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నాయని, అవినీతి అధికారుల మీద ఏసీబీ దాడులు చేసిన అవినీతి తగ్గడం లేదని అవినీతి అధికారులను బర్త్ రఫ్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పాలన సాగించాలని ఎన్నికల, హామీలను అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.వారి వెంట జిల్లా కార్యవర్గ సభ్యుడు వేనాచారి వున్నారు.


