Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ ఎస్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీదింటి సురేందర్

టీపీసీసీ ఎస్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీదింటి సురేందర్

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
టిపిసిసి ఎస్ సి శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీదింటి సురేందర్ సోమవారం నియమితులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన మీదింటి సురేందర్ టిపిసిసి ఎస్ సి శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని హైదరాబాదులోని గాంధీ భవన్ లో అందించారు. రాష్ట్రంలో టిపిసిసి ఎస్సి విభాగాన్ని మరింత బలోపేతం చేసి దానిని మరింత చైతన్యవంతంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి మీరు మీ వంతు కృషి చేయాలని అన్నారు. నాపై నమ్మకంతో పదవి అప్ప చెప్పినందుకు ఎస్సీ సామాజిక వర్గాన్ని చైతన్యవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్, మానకొండూరు ఎమ్మెల్యే టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ సత్యనారాయణ కు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి మీదింటి సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -