Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి

- Advertisement -

టిడబ్ల్యూజెఏప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చర్యలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు పెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల కుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని మూడేళ్ల పాటు అమలు చేసిందని, దురదృష్టవశాత్తు 2018 తర్వాత ఆ పథకం సేవలు నిలిచి పోవడంతో, ఎనిమిదేళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో దాదాపు రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లుగా చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని అమలు చేయాలని ఆయన గుర్తుచేశారు.  రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,స్వేచ్ఛ కోసం తమ యూనియన్ నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -