Thursday, June 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేషన్‌ షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలి

రేషన్‌ షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలి

- Advertisement -


పెరిగిన ధరలతో పేదల ఇబ్బందులు
ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
తిప్పర్తి మండల కేంద్రంలో సర్వే


నవతెలంగాణ- తిప్పర్తి

రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పదేపదే పెంచడం వల్ల రవాణా చార్జీలు, కూరగాయలు, ధాన్యాలు, నూనెలు సహా అన్ని రకాల వస్తువుల ధరలూ విపరీతంగా పెరిగాయని తెలిపారు. పేద ప్రజల ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసి బియ్యం మాత్రమే కాకుండా పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, కంది పప్పు, సబ్బులు తదితర 14 రకాల నిత్యావసర సరుకులను అందిం చాలని డిమాండ్‌ చేశారు. మహిళలు, కార్మికులు, వృద్ధులు, నిరుద్యోగులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు అన్నారు. రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, తిప్పర్తి మండల అధ్యక్షులు భార్గవి, సహాయ కార్యదర్శి పోకల ఝాన్సీ, రుక్మిణి, నూకల ఆదెమ్మ, నూకల సుబ్బమ్మ, భాగ్యమ్మ, యాదమ్మ, లక్ష్మి, కమలమ్మ, వెంకటమ్మ, సంధ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -