తొలిరౌండ్ లోనే ఓడిన ఉన్నతి,సాత్విక్-చిరాగ్
ఇండోనేషియా ఓపెన్
బ్యాంకాక్: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి.బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ లో ఆయుశ్ శెట్టి శుభారంభం చేయగా..మహిళల సింగిల్స్ లో ఉన్నతి హుడా,పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జంట ఓటమిపాలయ్యారు.తొలిరౌండ్ లో ఆయుశ్ 8-21, 22-20, 21-15తో వాంగ్(చైనా)పై మూడుసెట్ల హోరా హోరీ పోరులో చిత్తు చేశాడు.ఇక హెచ్ ఎస్ ప్రణయ్ 17-21, 21-16, 19-21తో నుయేన్(ఐర్లాండ్)చేతిలో పోరాడి ఓడాడు.పురుషుల డబుల్స్ లో 4వ సీడ్ సాత్విక్-చిరాగ్6-11తో వెనుకబడి ఉన్న దశలో గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు.ఇక మిక్స్ డ్ డబుల్స్ లో ఆర్.కపూర్-గద్దె జంట 21-14, 21-14తో చైనీస్ తైపీ జంటను ఓడించి ప్రి క్వార్టర్స్ కు చేరారు.ఇక మహిళల సింగిల్స్ లో ఉన్నతి హుడా 15-21, 14-21తో ఒకుహరా(జపాన్)చేతిలో వరుససెట్లలో ఓడారు.ఇక మహిళల సింగిల్స్ లో పివి సింధు శుభారంభం చేయగా..లక్ష్యసేన్ తొలిరౌండ్ లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే.



