5టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న భారత్
షెడ్యూల్ ఖరారు చేసిన ఇరుదేశాల క్రికెట్ బోర్డులు
ఆక్లాండ్ : ఈ ఏడాది అక్టోబర్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది.ఈ పర్యటనలో భాగంగా టీమిండియా సుమారు 40రోజుల పాటు ఈ సిరీస్ కొనసాగనున్నది. అక్టోబర్22నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే ఈ సిరీస్‌లో 5టీ20మ్యాచ్‌లు, 5 వన్డేలు,రెండు టెస్టులు ఆడనున్నారు.ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరగబోయే అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఇదే కానున్నది.న్యూజిలాండ్ పర్యటనలో మొత్తం 12మ్యాచ్‌లు ఉండనున్నాయి.గతంలో ఎప్పుడూ ఇంత భారీ సంఖ్యలో అక్కడ సిరీస్ జరగలేదు.రెండు దేశాల మధ్య క్రీడాసంబంధాలకు వందేళ్లు నిండిన నేపథ్యంలో ఈ భారీ సిరీస్‌కు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఆమోదం తెలిపాయి.అక్టోబర్22వ తేదీన తొలి టీ0మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.టీ20సిరీస్ తర్వాత వన్డే సిరీస్,నవంబర్4న ఆక్లాండ్‌లో తొలి వన్డే,నవంబర్19నుంచి23వరకు వెల్లింగ్టన్‌లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్,నవంబర్27నుంచి డిసెంబర్ 1వరకు రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్‌లో జరగనున్నాయి.



