ముగిసిన 2026 కామన్‌వెల్త్ క్రీడలు
ముగింపు వేడుకల్లో ఉట్టిపడిన భారతీయత
గ్లాస్గో (స్కాట్లాండ్)
11 రోజుల పాటు ఉత్సాహంగా సాగిన కామన్‌వెల్త్ క్రీడలు (బ్రిటీష్ పాలిత దేశాల ఆటల పోటీలు) ఘనంగా ముగిశాయి. 10 క్రీడాంశాల్లో జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. 13 బంగారు పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలు సహా 39 మెడల్స్ సాధించింది. ఓవరాల్‌గా పతక ప్రదర్శనలో నాల్గో స్థానంలో నిలిచింది. ఆస్ర్టేలియా (171), ఇంగ్లాండ్ (110), కెనడా (63) టాప్-3లో నిలిచాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి అనంతరం జరిగిన ముగింపు వేడుకలు ఆకట్టుకున్నాయి. స్కాట్లాండ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించే కళారూపాలతో మొదలైన ముగింపు వేడుకలు.. భారతీయ కళా రూపాల ప్రదర్శనతో అట్టహాసంగా ముగిసింది.
వందేండ్ల సంబరం భారత్‌లోనే
2026 కామన్‌వెల్త్ క్రీడలు ముగియగా.. గ్లాస్గో నిర్వాహకులు క్రీడల బ్యాటన్‌ను 2030 కామన్‌వెల్త్ క్రీడల వేదిక అహ్మదాబాద్‌కు అందించారు. ముగింపు వేడుకల్లో దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా కామన్‌వెల్త్ గేమ్స్ ఫ్లాగ్ (జెండా)ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి ఉషకు అందజేశారు. అహ్మదాబాద్ 2030 ది వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ :వసుదైన కుటుంబం ట్యాగ్ డిజిటల్ బోర్డును వేదికపై ప్రదర్శించారు. శంకర్ మహాదేవన్, గుజరాతీ సింగర్ భూమి త్రివేది ఆట పాటతో భారత అభిమానులను ఉర్రూతలూగించారు. కామన్‌వెల్త్ క్రీడలు 1930లో ఆరంభం కాగా.. 2023లో వందేండ్ల క్రీడోత్సవం అహ్మదాబాద్‌లో జరుగనుంది.
బైబై గ్లాస్గో.. హలో అహ్మదాబాద్
- Advertisement -
- Advertisement -



