Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. కూనంనేని సంతాపం

సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. కూనంనేని సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. మల్లారెడ్డికి అన్ని అంశాలపై పట్టు ఉన్న మేధావి అని, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై తనకు పూర్తి అవగాహన ఉన్నదన్నారు. ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులని అన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నాకు గాని, జూలకంటి రంగారెడ్డికి గాని, కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడేవని తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -