Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సంతాపం

సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం ప్రముఖ నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, సాగునీటి ప్రాజెక్టులపై మల్లారెడ్డికి ఉన్న విశేష అనుభవం, అవగాహన ఎంతో గొప్పవని కొనియాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ప్రజా, రైతాంగ సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన మల్లారెడ్డి సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -