Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల హరీష్ రావు సంతాపం

సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల హరీష్ రావు సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కమ్యూనిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు సంఘం నాయకుడిగా సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, సంక్షేమం కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో మల్లారెడ్డి పోషించిన కీలక పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -