నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం, అర్ధంలేని నిర్ణయాలు, సామ్రాజ్యవాదంతో కూడిన టారిఫ్‌ల విధింపు చర్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్ట దిగజారిపోతున్న విషయం తెలిసిందే. సొంత దేశంలోనే ట్రంప్ నిర్ణయాలపై నిరసన జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌కు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా… వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ఇందులో పలుగురు రిపబ్లికన్ సభ్యులు ప్రతిపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తీర్మానానికి అనుకూలంగా ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో 100+బిలియన్ల భారం అమెరికాపై పడిందని ఈ సందర్భంగా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా ప్రతినిధుల సభ.. ట్రంప్‌కు భారీ షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



