Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం..ముగ్గురు మృతి

బీహార్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం..ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ముజాఫ‌ర్ ఆస్ప‌త్రిలోని ఐసీయూలో ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు స‌జీవ‌ద‌హ‌నమైయ్యారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌న స్థ‌లానికి హుట‌హుటిన చేరుకున్నారు. ఫైర్ ఇంజ‌న్‌లతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సింది. సంఘ‌ట‌న స్థ‌లంలో స‌హాయ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రి ICUలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది, ఫైర్ ఇంజ‌న్ల స‌హాయంతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చామ‌ని మీడియాకు తెలియ‌జేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -