ఓఎంఆర్ షీట్స్‌లోని సమాధానాల్లో తేడాలున్నాయంటూ పిటిషన్
న్యూఢిల్లీ : ఓఎంఆర్ షీట్స్‌లో అసమానతలు ఉన్నాయంటూ ఆరుగురు నీట్ యూజీ అభ్యర్థులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్ష సమయంలో ఓఎంఆర్ షీట్స్‌లో వారు మార్క్ చేసిన సమాధానాలకు, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) అప్‌లోడ్ చేసిన కాపీల్లోని సమాధానాల్లో తేడాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రకటనకు ముందే విచారించాలని కోరడంతో..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ దాఖలైంది. పరీక్ష సమయంలో వారు గుర్తించిన సమాధానాలకు, ఎన్‌టీఏ అప్‌లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లలోని సమాధానాలకు తేడా ఉందని 600, 650కి పైగా మార్కులు సాధించిన ఆరుగురు అభ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నట్టు న్యాయమూర్తి ధర్మాసనానికి తెలిపారు. ఆ విద్యార్థులు ఎన్‌టీఏకు ఈ మెయిల్ చేయడంతో పాటు, వారి కార్యాలయానికి కూడా వెళ్లారని, కానీ ఎటువంటి స్పందన రాలేదని ఆయన తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో మే 3న జరిగిన నీట్ పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21ను తిరిగి నీట్ పరీక్షను నిర్వహించింది.
సుప్రీంకోర్టుకు నీట్ అభ్యర్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



