Thursday, June 4, 2026
E-PAPER
Homeఆటలుఏకైక టెస్టు మ్యాచ్‌కి టీమిండియా క‌స‌ర‌త్తు

ఏకైక టెస్టు మ్యాచ్‌కి టీమిండియా క‌స‌ర‌త్తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అఫ్గానిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కి టీమిండియా సిద్ధ‌మవుతుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నుంచి జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. జూన్ 6వ తేదీన ఈ చారిత్రక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.తొలిరోజు ప్రాక్టీస్ సెషన్‌లో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లు పాల్గొన్నారు. స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా జట్టు సహాయక సిబ్బందితో కలిశారు. 2018 తర్వాత భారత గడ్డపై అఫ్గానిస్థాన్ ఆడబోతున్న తొలి టెస్టు కూడా ఇదే కావడం విశేషం.

టెస్ట్ సిరీస్ త‌ర్వాత వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. జూన్ 14న(ధర్మశాల) ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే ప్రారంభంకానుంది. 17న (లఖ్‌నవూ), జూన్ 20న‌ (చెన్నై) వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

అఫ్గాన్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్‌కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్‌ జురెల్‌, హర్ష్‌ దూబె.

మూడు వన్డేల కోసం టీమ్ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గూర్నూర్ బ్రార్, హర్ష్‌ దూబె.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -