Monday, February 9, 2026
E-PAPER
Homeఆటలున్యూజిలాండ్‌ బోణీ

న్యూజిలాండ్‌ బోణీ

- Advertisement -

అఫ్గనిస్తాన్‌పై 5 వికెట్లతో గెలుపు

చెన్నై : చెపాక్‌లో అఫ్గనిస్తాన్‌ స్పిన్‌ మాయకు ఎదురొడ్డిన న్యూజిలాండ్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. గుల్బాదిన్‌ నయిబ్‌ (63, 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించగా.. అటల్‌ (29, 24 బంతుల్లో 2 ఫోర్లు), రసూల్‌ (20, 13 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), రహ్మతుల్లా (27, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్‌ (2/40) రెండు వికెట్లు పడగొట్టగా.. మాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర, జాకబ్‌ డఫ్ఫీ తలా ఓ వికెట్‌ తీసుకున్నారు.

183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (65, 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. ఫిన్‌ అలెన్‌ (1), రచిన్‌ రవీంద్ర (0) నిరాశపరిచినా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (42, 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి సీఫర్ట్‌ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించాడు. లోయర్‌ ఆర్డర్‌లో మార్క్‌ చాప్‌మన్‌ (28, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), డార్లీ మిచెల్‌ (25 నాటౌట్‌, 14 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), మిచెల్‌ శాంట్నర్‌ (17 నాటౌట్‌, 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరవటంతో అఫ్గాన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఆరంభంలోనే సీఫర్ట్‌ రిటర్న్‌ క్యాచ్‌ను రషీద్‌ ఖాన్‌ నేలపాలు చేయటం అఫ్గాన్‌ను దెబ్బకొట్టింది. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహమాన్‌ (2/31), అజ్మతుల్లా (1/40), రషీద్‌ ఖాన్‌ (1/36), మహ్మద్‌ నబి (1/18) వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -