- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం వద్ద నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. నీటికుంట ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. చిన్నారుల జాడ తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని చెరుకుపాలేనికి చెందిన ఇల్లా దినేశ్ (10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12), కరేటి అభిరామ్ (14)గా గుర్తించారు.
- Advertisement -



