నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలలో గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించడం జరిగిందని ఆయా గ్రామాల కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని చెండేగావ్, బస్వాపూర్ , బిజ్జల్ వాడీ, డోన్గాం, దోస్తుపల్లి, గ్రామాలకు చెందిన సర్పంచ్లు బండేడ్ వార్ లక్ష్మణ్, బస్వాపూర్ శ్రీమతి రమణ సురేష్ గొండ, బిజ్జ ల్ వాడి సర్పంచ్ వాగ్మారే గంగాబాయి మాదు, డోన్గాం సర్పంచ్ కే. శ్రీనివాస్, దోస్తుపల్లి సర్పంచ్ మారుతి, గ్రామసభలు నిర్వహించడంతో పాటు పని తీర్మానాలు చేశారు. ప్రజా పాలనశ – ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రా కార్యచరణ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించామని అన్నారు.
మొదటగా గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, సాగునీరు, వైద్యఆరోగ్యం, ఐకెపి శాఖ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ బడిబాట, శానిటేషన్ పనులు, వివేను శాఖ, సంబంధించిన అధికారులు పాల్గొని తమ తమ నివేదికలను గ్రామస్తులకు వివరించి, పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంఈఓ తిరుపతియ్యా, ఆయా గ్రామాల సర్పంచులైన లక్ష్మణ్, రమణ సురేష్, మారుతి, గంగా బాయి, కే. శ్రీనివాస్, జిపి కార్యదర్శిలు వికాస్ రెడ్డి, భరద్వాజ్, జిపిఓ లు, ఉప సర్పంచ్లు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



