నవతెలంగాణ-మిడ్జిల్
అటెండర్ నుండి కలెక్టర్ వరకు ఉద్యోగస్తులు బదిలీ తప్పదని, రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులకు ఎక్కువ గుర్తింపు ఇస్తారని, ఉద్యోగంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు సేవ చేస్తే స్థిర స్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని సర్పంచ్ నాగమ్మ ఆంజనేయులు అన్నారు. గురువారం మండలంలోని వేముల గ్రామంలో గత ఏడు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిబదిలీపై వెళ్తున్న్నారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ ను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నరేష్ యాదవ్ పనిచేశారని కొనియాడారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సిద్ధార్థ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వార్డు సభ్యులు రవి పద్మమ్మ రేణమ్మ అలివేలమ్మ దేవమ్మ గోపాల్ శివ లీల నాగరాజ్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాండు యాదవ్, బండారు కృష్ణయ్య ,పెరుమల జంగయ్య, మంద భీమ్రాజ్, దదనoపల్లి చంద్రశేఖర్, వెంకటేష్, నారాయణ, రామచంద్ర ,శివ, వెంకటేష్ ,మాజీ వార్డు సభ్యులు శ్యామ్ జిపిఓ భాషా , నూతనంగా పంచాయతీ కార్యదర్శి జే లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.



