Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గృహజ్యోతి లబ్ధిదారులకు వేసవి షాక్.!

గృహజ్యోతి లబ్ధిదారులకు వేసవి షాక్.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు వేసవి మంటలతో బిల్లుల షాక్ తగిలింది. విపరీతమైన ఎండలతో తల్లడిల్లిన జనాలు..విద్యుత్ ను అధికంగా వాడడంతో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీలు ఆపైగా నమోదయ్యాయి.దీంతో జనాలు ఫ్యాన్లు, కూలర్లు,ఏసీలు పగలు,రాత్రి తేడా లేకుండా ఉపయోగించారు. ఫలితంగా చాలా మంది వినియోగదారులు బిల్లుల పరిధిలోకి వచ్చారు.తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తుంది. ఇలా పథకం వల్ల ఒక్కో లబ్ధిదారు నెలకు దాదాపు రూ.800 వరకు ప్రయోజనం పొందుతున్నారు. కానీ 200 యూనిట్లు పైబడి వినియోగించిన ప్రతీ వినియోగదారుడికి బిల్లులు జారీ కావ డంతో బిల్లులు చెల్లించాల్సిందే.మే నెలలో 1470 మంది 200 యూనిట్లు దాటి విద్యుత్ను విని యోగించడంతో వీరికి రూ.11,76 లక్షల బిల్లులు జారీ అయ్యాయి. ఏప్రిల్లో 8 శాతం వినియోగదా రులు, మే నెలలో 10శాతం వరకు వినియోగదారులు పథకానికి దూరం కావాల్సి వచ్చింది.మండలంలో మొత్తం 6164 గృహ విద్యుత్ మీటర్లు ఉండగా 4741 మీటర్లు గృహజ్యోతి పథకానికి వర్తిస్తుండగా ఇందులో ఏప్రిల్,మే నెలల్లో 10 శాతం వినియోగదారుల పథకానికి దూరం అయ్యారు.

యూనిట్లు పెరిగితే బాదుడే..
సాధారణంగా 100 యూనిట్లు వాడే వారు వేసవిలో 200 యూనిట్లు వాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎల్ 1 కేటగిరీలో 100 యూనిట్లలోపు ఒక్కో యూనిట్కు రూ.1.45 పైసల నుంచి రూ.2.60పైసలు ఉంటే,150 నుంచి 200 యూనిట్లు దాటితే యూనిట్ చార్జీ ఒక్కసారిగా రూ.4.30 నుంచి రూ.5.00 వరకు పెరుగుతుంది. ఇక 301 యూనిట్ల నుంచి 400 అయితే ఏకంగా యూనిట్కు రూ.8.50 ఉంటుంది. కాగా చాలా మంది వినియోగదారులు వేసవిలో 200 యూనిట్లు దాటడంతో వారికి యూనిట్కు రూ.5 చొప్పున భరించాల్సి వచ్చింది. అంటే రమారమి రూ.1,200 వరకు ఒక్కొక్కరికి బిల్లులు వచ్చాయి.

యూనిట్లు తగ్గితే మళ్లీ పథకం పరిధిలోకి..
కాగా రెండు మూడు నెలలుగా విద్యుత్ వినియోగం పెరిగి గృహ జ్యోతి పథకానికి దూరం అయిన వినియోగదారులు వర్షాకాలం ప్రారంభం కాగానే విద్యుత్ వినియోగం తగ్గి 200 లోపు యూనిట్ల పరిధిలోకి వస్తే మళ్ళీ పథకం కిందకు చేరుతారు.యూనిట్లు పెరిగి బిల్లులు ఒకసారి జారీ అయితే పథకం వర్తించదనే వదంతులు అవాస్తవమని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వినియోగదారులు పొదుపుగా విద్యుత్ను వాడుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -