ఎంపిడిఓ, తహశీల్దార్
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో పేరుకపోయిన సమస్యల పరిస్కారం కోసమే గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా మండల ఎంపిడిఓ క్రాoతికుమార్,తహశీల్దార్ రవికుమార్ తెలిపారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు తాడిచెర్ల, పెద్దతూoడ్ల,చిన్నతూoడ్ల,అడ్వాలపల్లి గ్రామాల్లో సర్పంచ్లు బండి స్వామి,బండారి నర్సింగం, గడ్డం క్రాoతి,అజ్మీరా సారక్క అధ్యక్షత గురువారం గ్రామసభలు నిర్వహించారు.గ్రామాల్లో రెండవ విడత అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి చేయుత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు,ఎస్ఐ వడ్లకొండ నరేశ్,వ్యవసాయ అధికారి శ్రీజ,ఏపిఎం హనుమంతరావు, ఇరిగేషన్,విద్యుత్ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



