Thursday, June 4, 2026
E-PAPER
Homeకరీంనగర్బాబా వికృత చేష్టలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి

బాబా వికృత చేష్టలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, భర్తీపూర్ మోహన్ బాబా వికృత చేష్టలపై గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో పత్రికా ప్రకటనల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఇంతవరకు విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సీపీఐ(ఎం) పార్టీ జగిత్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ నాయకత్వంలో ఈరోజు జిల్లా ప్రతినిధి బృందం భర్తిపూర్ గ్రామాన్ని దర్గాను శివాలయ ట్రస్టును సందర్శించి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటియూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన, అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సుధారాణి, అధ్యక్షురాలు వల్లపు సుజాత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నరసయ్య బృందంలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -