మున్సిపాలిటీ వార్డు సభలో అదనపు కలెక్టర్ గణేష్, చైర్మన్ సారంగపాణి
నవతెలంగాణ-వర్ధన్నపేట
పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ రక్షణ అంశాలపై పట్టణ పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు డి.సి. తండాలో ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు. ఈ సభ కు హాజరైన వరంగల్ అదనపు కలెక్టర్ వై.వి గణేష్ , మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణిలు పట్టణ అభివృద్ధి పై చేపట్టే కార్యక్రమాలపై వివరించారు. పారిశుధ్య సమస్యలు లేకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యలు, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి నిర్వహణ తదితర అంశాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్డు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఏమైనా సమస్యలను తమకు నేరుగా తెలుపవచ్చు అన్నారు.
• వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా నివారణ చర్యలు చేపట్టడం, పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరచడం.
• రహదారులు వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి తో పరిష్కరించాలని అధికారులకు సూచించారు ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మాలోతు దేవేందర్, వార్డు సభ సూపర్ వైజర్ అనిల్, మున్సిపల్ వార్డు అధికారి రాజేందర్, ప్రజాప్రతినిధులు కిమా నాయక్,లచ్చి రామ్, స్వామీ, అంగోతు శ్రీధర్, అంగోతు రాజేందర్, వార్డు ప్రజలు మున్సిపాలిటీ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



