నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పురపాలక సంఘంలో జల్ భగీరథ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు, ఆలేరు పురపాలక సంఘం చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం 2,3 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యాచరణ ప్రణాళిక సమావేశం మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభలు నిర్వహించారు.
వార్డు సభలలో ప్రజలకు సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ రూల్స్, 2026.,జల్ సంచయ్ – జల్ భగీరత పథకం క్రింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టుట, మురికి కాలువల శుభ్రం చేయుట మరియు పూడిక తీయు పనులు,వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక గురించి మాట్లాడారు. మంచి నీటి సరఫరా మరియు నిర్వహణ,నీరు నిలువ ప్రాంతాల నివారణ మరియు పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ మరియు వీది దీపాలు, మొక్కలు మరియు పర్యావరణ సంరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను చర్చించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ వనరాశి మరియమ్మ, 3వ వార్డు కౌన్సిలర్ యాట శివ, మేనేజర్ బి జగన్ మోహన్, మున్సిపల్ కో ఆప్షన్ కౌన్సిల్ సభ్యురాలు ఇంతియాజ్ ఇర్ఫాన్, ఇన్చార్జి ఎస్ఐ రూపశ్రీ, మున్సిపల్ సిబ్బంది కే రాజు, కే.బాబు & మెప్మా రిసోర్స్ పర్సన్ లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



