నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పల్లెచెరువు కట్ట మైసమ్మకు గురువారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు అందరూ కలిసి కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభంలో ప్రతి సంవత్సరం కట్ట మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామంలో పిల్లా జెల్లా, గొడ్డు గోదా బాగుండాలని, వర్షాలు బాగా కురిసి చెరువులు కుంటల నుండి పంటలు సమృద్ధిగా పండాలని కట్టమైసమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మంజూరాణి, ఫిల్డ్ అసిస్టెంట్ రమ, మెట్లు, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
పల్లెచెరువు కట్ట మైసమ్మకు ఉపాధి కూలీల ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



