Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర్జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థి

అంతర్జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థి

- Advertisement -

– భారత చౌక్ బాల్ జట్టుకు ఎంపిక 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మిసిమి పాఠశాలకు చెందిన విద్యార్థి శాశ్వంత్ భారత చౌక్ బాల్ జట్టుకు  ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండంట్ బాలి రవీందర్ గురువారం తెలిపారు.గత నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు గోవాలో జరిగిన జాతీయ స్థాయి  పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలంగాణ చౌక్ బాల్ ప్రధాన కార్యదర్శి బసవత్ వెంకటేష్ తెలిపారు. ఆగష్టు 19 నుండి 26 వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీలలో భారత జట్టు తరుపున పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్బంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రంలో కరెస్పాండంట్ బాలి రవీందర్ మాట్లాడుతూ ఎక్కడో మారుమూల ప్రాంతం నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలోని మిసిమి ఉన్నత పాఠశాల విద్యార్థి భరత జట్టుకు  ప్రాతినిధ్యం వహిస్తున్నందున చాలా గర్వంగా ఉందని తెలిపారు.జట్టు తరుపున అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి పుట్టిన గ్రామానికి మంచి పేరు తీస్కోరావాలని ఆకాంక్షించారు. పాఠశాల నుండి ఇండియా జట్టుకు ఎంపికయ్యేలా తన కఠోర శ్రమతో కోచింగ్ ఇచ్చి తీర్చిదిద్దిన పాఠశాల వ్యాయామ ఉపాద్యాయుడు సంజీవ్ ను ప్రత్యేకంగా అభినందించింది సత్కరించారు. మునుముందు మిసిమి పాఠశాల నుండి మారేందరో విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రానించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థితో పాటు పిఈటి సంజీవ్ ను  అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -