సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాదం
నవతెలంగాణ-మిరుదొడ్డి
పొలంలో వరి కొయ్యలు తగలబెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల మల్లయ్య(61) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఉదయం తన పొలంలో వరి పంట కొయ్యలను తగలబెడుతుండగా.. గాలికి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో మల్లయ్య ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుపోయాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పి, ఆయన్ను బయటకు తీసేలోపే తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. రైతులు వరి కొయ్యలు తగలబెట్టి ప్రాణాలు తీసుకోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
వరి కొయ్యల మంటల్లో రైతన్న సజీవ దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



